29 May, 2026 | 2:52 AM

30న ప్రశిక్షణా మహా అభియాన్ తరగతులు

29-05-2026 12:29 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

మనకొండూర్, మే 28 (విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వేదికగా ఈనెల 30, 31 న రెండు రోజులపాటు నిర్వహించనున్న పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా మహా అభియాన్ తరగతులను విజయవంతం చేయాల బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కోరారు.

గురువారం శిక్షణ తరగతుల వేదిక ప్రాంగణం వద్ద ముఖ్య నేతలతో, శిక్షణా తరగతులకు సంబంధించి వివిధ విభాగాల బాధ్యులతో సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, పార్టీ శ్రేణులకు నాయకులకు, కార్యకర్తలకు సిద్ధాంతపరమైన అవగాహన కల్పించేందుకు పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా మహా అభియాన్ దేశవ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు.

శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ముగింపు (సమారోప్) కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ అపేక్షితులు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రశిక్షణ కన్వీనర్ మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, సంచలన సమితి ప్రముఖ్ గుజ్జ శ్రీనివాస్, కార్యక్రమ ప్రముఖ్ కళ్ళెం వాసుదేవ రెడ్డి, వ్యవస్థ ప్రముఖ్ ఇనకొండ నాగేశ్వర్ రెడ్డి, సహ ప్రముక్ చింతం శ్రీనివాస్ వివిధ విభాగాలకు సంబంధించిన ప్రముక్ లు, ప్రబంధకులు బోంతల కళ్యాణ్ చంద్ర , సుగుర్తి జగదీశ్వర చారి, కనుమల్ల గణపతి, దండు కొమురయ్య, రంగు భాస్కరాచారి, పుష్పాల రఘు, అడిచేర్ల రాజు, బండ రమణ రెడ్డి , గుంజేటి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.