పాముకాటుకు మహిళ మృతి
మాడ్గుల, మే28,( విజయ క్రాంతి): మాడ్గుల మండల కేంద్రంలో గుగిళ్ల సరిత(40) పాము కాటుకే గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సిఐ వేణుగోపాల్ రావు తెలిపారు. బొంతలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గురైన పట్టించుకోకుండా నిద్రపోయినట్లు ఆయన వివరించారు.
ఉదయం ఆమె భర్త సుందర్ పాల్ నిద్ర లేపగా కళ్ళు తిరుగుతూ పడిపోగా ఏమైందని ప్రశ్నించగా నిద్రలో మెడపై ఏదో కడిచినట్లు కనిపించిందని చెప్పినట్లు ఆయన తెలిపారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆమనగల్లు ఆసుపత్రికి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించగా ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. మృతురాలి మరిది ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.






