17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గన్నేరువరంలో బీజేపీ బలమైన శక్తిగా అవతరించింది

18-12-2025 06:57 PM

ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి చెప్తాం 

బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్

గన్నేరువరం (విజయక్రాంతి): గన్నేరువరం మండలంలో బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందని, జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్, బిఆర్ఎస్ ల కుట్రలు కుతంత్రాలను, డబ్బు మద్యం ప్రలోభాలను తట్టుకొని బరిలో నిలిచి, నాలుగు సర్పంచి స్థానాలను కైవసం చేసుకుందని బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ తెలిపారు. గన్నేరువరంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ఎస్ లు పంచాయితీ ఎన్నికల్లో అధికారం పొందడం కోసం అనేక అడ్డదారులు తొక్కిందన్నారు.

మండలంలోని అనేక గ్రామాల్లో డబ్బు, మద్యంతో అనేక ప్రలోభాలతో ఓటర్లను ప్రభావితం చేశారని, మండల కేంద్రమైన గన్నేరువరంలో కూడా అలాంటి పరిస్థితులు ఉండడంతోనే బీజేపీ అభ్యర్థి ఓటమి చెందడం జరిగిందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా నాయకత్వ దిశానిర్దేశంకు అనుగుణంగా మండలంలోని బీజేపీ శ్రేణులు ఎన్నికల కోసం నిర్విరామంగా పనిచేశారని తెలిపారు. త్వరలో జరగబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు మచ్చ బాలరాజు, పుల్లెల రాము, పుల్లెల జగన్, సందవేణి ప్రశాంత్ యాదవ్, 8వ వార్డు సభ్యులు మచ్చ సాయికృష్ణ, జాడిగం వినయ్, టేకు అనిల్, సిరిగిరి తిరుపతి పాల్గొన్నారు.