calender_icon.png 6 December, 2024 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర బీజేపీకి లేదు

05-11-2024 03:46:56 AM

అంతర్గత కుమ్ములాటలతో సీఎం మారడం ఖాయం

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్, నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బీజేపీకి లేదని, బీజేపీ కుట్ర పన్నుతున్నదని మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నేతలు ఆరోపించడం తగదని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిని సీఎంగా కొందరు సీనియర్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని, కాంగ్రెస్‌లో అంతర్గత కు మ్ములాటలతో సీఎం మారుతాడని జోస్యం చెప్పారు. సీఎం, మంత్రుల మధ్య ఐక్యత లేదని, దీనికి వారు చెబుతున్న మాటలే నిదర్శమని, క్యాబినేట్, కాంగ్రెస్‌లో విభేదాలను కట్టడి చేయడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు.