calender_icon.png 6 December, 2024 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోనే ఉంటూ నేతలపై విమర్శలా?

05-11-2024 03:52:59 AM

కాంగ్రెస్ బీ ఫామ్‌పైనే మల్లన్న విజయంఎంపీ రఘువీర్‌రెడ్డి 

నల్లగొండ, నవంబర్ 4 (విజయక్రాంతి): మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 3న జరిగిన బీసీ గర్జనలో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి స్పందించారు. సోమవారం దామరచర్ల మండలం కల్లేపల్లి బంగారు మైసమ్మ ఆలయ కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌పైనే మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారని గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొ న్నారు.

ఏ ఒక్కరో ఓట్లు వేస్తే మల్లన్న ఎమ్మెల్సీగా విజ యం సాధించలేదని ఆయన విజయానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతోపాటు కార్యకర్తలంతా కృషి చేశారన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడే ముందు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలే తప్ప వివాదాలు సృష్టిం చేలా వ్యవహరించడం మంచి పరిణామం కాదన్నారు. ఆయనవెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఉన్నారు.