18-10-2025 05:35:25 PM
సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దినకర్, శ్రీనివాస్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అసలు దోషి బీజేపీ అని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్ అన్నారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు. బీసీలు 56% ఉన్నారని కులగణనలో తేలినప్పటికీ, 42% రిజర్వేషన్లకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చే బాధ్యత నుంచి తప్పించుకుంటూ న్యాయస్థానాలపై మోపడం అన్యాయం అని అన్నారు. బీసీల ఓట్లతో గెలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులు రాజ్యాంగ సవరణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కార్తీక్, టి. ఆనంద్, మాలాశ్రీ, రాజేందర్, నాయకులు, తిరుపతి, నిఖిల్, రాజ్‌కుమార్, నైతం రాజు, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.