18-10-2025 05:39:09 PM
పలువురి ఫోన్లకు డబ్బులు పంపించాలంటూ మెసేజ్ లు..
అప్రమత్తంగా ఉండాలంటున్నా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): డబ్బులు ఎలాగైనా లాక్కోవడమే లక్ష్యంగా హ్యాకర్లు ప్రముఖుల ఫోన్ నెంబర్లను కూడా హ్యాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఫోన్ నెంబర్ ను హ్యాక్ చేసి పలువురికి డబ్బులు పంపించాలని వాట్సప్ ద్వారా ఎంఎంఎస్ చేశారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మీడియాకు సమాచారం అందించారు. తమ నెంబర్ ను ఎవరో హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారని ఎవరు కూడా పంపించకూడదని తెలిపారు. హ్యాక్ చేసిన అంశం సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు.