12 March, 2026 | 3:50 AM

చరిత్రలో ఇది చీకటి రోజు

12-03-2026 02:02 AM

స్పీకర్ నిర్ణయంపై ఓటుకు వెళ్తాం 

బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, మార్చి 11 (విజయక్రాంతి): ఎమ్మెల్యేల ఫిరాయింపులో తీర్పు వెలువడించిన స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమ ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నిర్మల్‌లో ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల చట్టం తీర్పులో స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో కలిసి తిరుగుతున్నా స్పీకర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. నిష్పక్షపా తంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి వత్తాసు పలికి ప్రజల తీర్పును అగౌరవపరచారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చీకటి రోజుగా బీజేపీ భావిస్తుందని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై ఓటుకు వెళ్తామని చెప్పారు.