17 April, 2026 | 9:29 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

కామారెడ్డికి వచ్చేందుకు బీజేపీ నేతల యత్నం

21-02-2026 10:13 PM

ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డిలో ఎమ్మెల్యే కేవీఆర్, షబ్బీర్​అలీ మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు  రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయమై బీజేపీ, కాంగ్రెస్​ నాయకులు మూడు రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. తాజాగా శనివారం స్థానిక శిశుమందిర్​ వద్ద కలుద్దామని సవాల్​ విసురుకున్నారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేకు మద్దతుగా బీజేపీ నేతలు కామారెడ్డి పట్టణానికి రావాలని నిర్ణయించారు.

అయితే జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డికి బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​ రావును హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నాయకులు కూడా కామారెడ్డికి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఏం జరగబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కామారెడ్డికి రాని పక్షంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కేవీఆర్​కు మద్దతుగా మాట్లాడేందుకు హైదరాబాద్​ నుంచి ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కామారెడ్డికి బయలు దేరారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు  వారిని మేడ్చల్​ వద్ద అడ్డుకున్నారు. కామారెడ్డికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పోలీసులు వారికి నచ్చజెప్పారు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించారు.