మండలంలో బీజేపీ నాయకుల సంబరాలు
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని మునిపల్లి చౌరస్తా వద్ద బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచెర్రీ లో బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్బంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు అంకల శేఖర్,ఆధ్వర్యంలో మండలంలో పలు గ్రామాల్లో సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్ పంచి పంపిణి చేశారు.
మండల అధ్యక్షుడు నాగశెట్టి మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు బీజేపీని గెలిపించారన్నారు. దేశంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో సోమవారం సంబరాలు నిర్వహించారు. బెంగాల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు. ఊహించిన దానికంటే భారీ సీట్లు కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






