18 April, 2026 | 5:30 PM

కాంగ్రెస్ కూటమికి పుట్టగతులు ఉండవు—బీజేపీ నాయకులు

18-04-2026 04:07 PM

తాండూరు,(విజయక్రాంతి): భారత ప్రజాస్వామ్యంలో ఏప్రిల్ 17,26  ఒక చీకటి రోజు అని, మహిళ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ కూటమికి రాబోవు రోజుల్లో పుట్టగతులు ఉండవని వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ మున్సిపల్ బిజెపి కౌన్సిలర్లు నాగారం మల్లేశం, అంతారo కిరణ్, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహిళా బిల్లుకు ఆమోదం పొందనందుకు వారు మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్, I.N.D.I.A కూటమి తమ మహిళా వ్యతిరేక నైజాన్ని చాటుకుంటూ, మహిళల పట్ల క్షమించరాని నమ్మకద్రోహానికి పాల్పడ్డాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసిన  పార్టీలను దేశ మహిళలు  క్షమించరని అన్నారు.