18 April, 2026 | 5:31 PM

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉపాధికి భరోసా తొట్ల తిరుపతి యాదవ్‌

18-04-2026 04:06 PM

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ కు సన్మానంలో ప్రవేట్ సెక్యూరిటీ గార్డులు

రామగిరి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఆర్జీ–3 (RG-3) ప్రాంతంలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి, ఎలాంటి నిబంధనల అడ్డంకులు లేకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ను శనివారం ఘనంగా సత్కరించారు.

రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆయనను శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జీ–3 పరిధిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఉపాధి సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా తిరుపతి యాదవ్ ప్రత్యేక చొరవ చూపినట్లు తెలిపారు.