calender_icon.png 23 December, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారయ్య మృతికి బీజేపీ నేతల సంతాపం

23-12-2025 06:58:03 PM

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని నల్లగుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి, మండల జనరల్ కార్యదర్శి చర్లపెల్లి సతీష్ తండ్రి చర్లపెల్లి కనక సారయ్య మృతి చెందడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే బీజేపీ నేతలు గ్రామానికి చేరుకుని వారి స్వగృహంలో మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పైడాకుల మల్లేష్, గంగుల రాజ్ కుమార్, మందల రమణారెడ్డి, మందల విజయ్ కుమార్, రెడ్డి శ్రీను, శ్రీధర్‌తో తదితరులు పాల్గొన్నారు.