23-12-2025 07:00:21 PM
ఆళ్లపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శాంతి విద్యనికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా పునీత పేతురు, పౌల్ చర్చి తిరు హృదయ సభ విచారణ గురువులు సిద్దెల జేసు ప్రసాద్ హాజరయ్యారు. ఈ మేరకు ఏసు జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలు వేషధారణలతో క్రిస్మస్ తాత,శాంతా క్లాజ్, క్రిస్మస్ ట్రీ పలు భక్తిగేయాలకు విద్యార్థులు నృత్యాలు చేశారు.
అనంతరం విద్యార్థులకు క్రిస్మస్ బహుమతి కానుక అందజేశారు. అనంతరం ఫాదర్ జేసు ప్రసాద్ మాట్లాడుతూ..సర్వమానవాళి కోసం డిసెంబర్ 25 రోజున జన్మదినం మహోత్సవాన్ని క్రైస్తవ భక్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్వహించుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో సిస్టర్ మహిత హెచ్.ఎం, సిస్టర్ ప్రశాంత, సిస్టర్ డామరీస్, షమీమ్, జ్యోతి, శిరోమణి, సహన, సింధు, వెన్నెల, జ్యోతిర్మయి యానిమేటర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.