calender_icon.png 23 December, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సేవలో యువత ముందుకు రావడం అభినందనీయం

23-12-2025 06:54:34 PM

* మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులకు అందుబాటులో శిక్షణను అందిస్తూ ఉద్యోగాలు పొందేలా తయారు చేయడం అభినందనీయమని మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. విజిఎస్ డిఫెన్స్ అకాడమీ నుండి శిక్షణ పొంది ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు సాధించిన శ్రీయ, వినయ్, మన్మత్ లు మంగళవారం మాజీ చైర్మన్ ను శాంతినగర్ లోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ వారిని సాదరంగా ఆహ్వానించి, శాలువాతో సత్కరించి అభినందించారు.  

ఈ మేరకు జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వి.జి.ఎస్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ పలువురు యువకులు అగ్ని, వాయు, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందడం అభినందనీయమని అన్నారు. చిన్న వయసు లోనే విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు అందుకునేలా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ అకాడమీ నుండి ఇది వరకు 12 మంది విద్యార్థిని విద్యార్థులు ఆర్మీ నేవీ ఉద్యోగాలు పొందడంఫై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు రాజేష్, కుమ్రా రాజు, కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.