15 May, 2026 | 2:05 AM

అప్పుడు కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు?

15-05-2026 01:11 AM

బీజేపీ నేతలు తుమ్మడి హట్టికి అనుమతులు తేవాలి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి) : ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు తుమ్మిడి హట్టి అనుమతులపైన కేంద్ర మం త్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.   కేం ద్రంలో, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని, అందుకు బీజేపీ నేతలు బాధ్యత తీసుకొని తుమ్మడిహట్టికి అనుమతి వచ్చేలా చూడాలన్నారు.

గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మా ట్లాడుతూ మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిందని, ఇప్పటి వరకు స్పందన లేదన్నా రు. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో అప్పటికే బీజేపీ ప్రభుత్వం పోలవరం  కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారన్నారు. తుమ్మడిహట్టి వద్ద వెయ్యి ఎకరాలలోపే మహారాష్ట్ర భూ ములు ముంపునకు గురవుతున్నాయన్నారు.