6 June, 2026 | 2:07 AM

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

06-06-2026 12:46 AM

చిట్యాల, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల పట్టణంలో బిజెపి నాయకులు శుక్రవారం మొక్కలు నాటారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో గల పాటిమీద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పర్యావరణ స మతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు జయరాపు రామకృష్ణ, గంజి గోవర్ధన్, మాజీ జిల్లా కార్యదర్శి బోడిగే అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.