4 May, 2026 | 2:03 PM

బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ

04-05-2026 12:45 PM

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో(West Bengal Election Results 2026) బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మధ్యాహ్నం 12.32 గంటల వరకు 178 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో బెంగాల్ బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.  భవానీ పూర్‌లో మమతా బెనర్జీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీయే విజయం, ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసానికి ప్రతిబింబం అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్డీయే మరింత బలపడిందని ఈ ఫలితం చాటి చెబుతోందన్నారు. అభివృద్ధి పట్ల ఎన్డీయే నిబద్ధతకు ప్రజలు ఇస్తున్న మద్దతు కనిపిస్తోందన్నారు. మోదీ, అమిత్ షా, నితిన్ నబీన్ కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్డీయే విజేతలు, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో BJP 177, AITC 93, AJUP 2, BGPM 1, CPI(M), AISF 1 స్థానాల్లో ఉన్నాయి.  పశ్చిమ బెంగాల్ ఈ సారి బీజేపీదే అంటూ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ 2026 ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది.