Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Tamil Nadu Election Results 2026) విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. తమిళనాడులో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతోంది. టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేసింది. అధికాల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. అన్నాడీఎంకే కూటమి ఆధిక్యాల్లో రెండో స్థానంలో ఉండగా, డీఎంకే కూటమి ఆధికాల్లో మూడోస్థానానికి పడిపోయింది. పార్టీ స్థాపించిన రెండేళ్ల 2 నెలల వ్యవధిలోనే విజయ్ పార్టీ చరిత్ర సృష్టిస్తోంది.
ఇలాంటి ఎన్నికల ఫలితాలు, రాజకీయ విశ్లేషణ కోసం మా Politics విభాగాన్ని చదవండి.
విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. విజయ్ పార్టీ దూసుకెళ్తుండటంతో పార్టీ శ్రేణులు తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు. కోయంబత్తూరులో టీవీకే శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో TVK 108, ADMK 63, DMK 41, PMK 6, INC 5, BJP 3, CPI 2 స్థానాల్లో ఉన్నాయి. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని తాజా పోకడల ప్రకారం... పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) 83స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 159 స్థానాల్లో ముందంజ వేస్తూ విజయపథం వైపు సాగుతోంది. అసోంలోనూ బీజేపీ జోరుగా ముందుకు దూసుకెళ్తోంది.
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ వార్తల కోసం Vijayakranthi News హోమ్‌పేజ్‌ను సందర్శించండి.
ఇవి కూడా చదవండి:
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్
తమిళనాడులో సంచలన ఫలితాలు.. విజయ్ TVK రికార్డు
బీజేపీ ఆఫర్‌కు టీవీకే నో! — 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనను ఖండించిన విజయ్ పార్టీ






