4 May, 2026 | 3:45 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •  

ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన

04-05-2026 02:36 PM

టీఎంసీ గెలువబోతోంది: 

ఎన్నికల ఫలితాల సరళిపై మమతా బెనర్జీ స్పందన

కోల్‌కతా: ఎన్నికల ఫలితాల సరళిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి టీఎంసీ నేతలు వెళ్లవద్దని సూచించారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ(West Bengal election results 2026) గెలువబోతోందని మమత పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 నుంచి 4 రౌండ్ల లెక్కింపే జరిగిందని ఆమె తెలిపారు. చాలాచోట్ల 14 నుంచి 18 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతోందని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఎంసీనే విజేతగా నిలుస్తోందని జోస్యం చెప్పారు. కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదని మమతా బెనర్జీ వెల్లడించారు.

పథకం ప్రకారమే బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్నారని ఆరోపించారు. చాలా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఆపేశారని చెప్పారు. టీఎంసీ నేతలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ఆధారంగా ఓట్లు దొంగిలించే ప్రయత్నం జరిగిందని తెలిపారు. టీఎంసీ.. వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా ప్రకటించట్లేదన్నారు. అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఓట్ల లెక్కింపులో ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర బలగాలు.. ఈసీతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.