calender_icon.png 15 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్డీయే సునామీ

15-11-2025 02:30:19 AM

డబుల్ సెంచరీ కొట్టిన కూటమి

బీజేపీకి 89, జేడీయూకు 85 సీట్లు

మట్టికరిచిన మహాఘఠ్బంధన్

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను   తలకిందులు చేస్తూ ‘డబుల్ సెంచరీ’ సాధించి ‘మహాఘఠ్బంధన్’(ఎంజీబీ)ని మట్టికరిపించింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 243 కాగా, వాటిలో ఎన్డీఏ కూటమి ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకున్నది.

 కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ 89, జేడీయూ 85 సీట్లను సాధించాయి. మిగిలిన మూడు భాగస్యామ్య పార్టీలు 28 సీట్లను దక్కించుకున్నాయి. ‘మహాఘఠ్బంధన్’లో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ కేవలం 25 సీట్లతో  సరిపెట్టుకుంది. కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా 5 సీట్లకు పరిమితమైంది. అలాగే దేశంలో టాప్ మోస్ట్ ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ సొంత పార్టీ ‘జన్ సురాజ్’ కనీసం ఖాతా అయినా తెరవలేదు. దీంతో రాజకీయాల్లో ఆయన కెరీర్ హస్తగత సమాప్తమైనట్లేనని అనిపిస్తున్నది.

ఎన్డీయే కూటమి సునామీ

243 అసెంబ్లీ స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 122

-ఏకంగా 202 సీట్లు సాధించిన ఎన్డీయే కూటమి

-కూటమిలో బీజేపీ 89, జేడీయూ 85 స్థానాలు కైవసం

-ఈ సారి కూడా నేరుగా పోటీ చేయని నితీశ్ 

-ఎమ్మెల్సీ అయి.. ఆ తర్వాత సీఎం పీఠం అధిరోహణ

-కేవలం 35 సీట్లకు పరిమితమైన ‘మహాఘఠ్బంధన్’

పాట్నా, నవంబర్ 14: బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 202 స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసింది. రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎవరూ ఊహించిన రీతిలో అసెం బ్లీ స్థానాలను కైవసం చేసుకున్నది.

ఎన్డీ యే కూటమిలోని బీజేపీ జేడీయూ  85, ఎల్‌జేపీ (రాంవిలాస్ పాశ్వాన్) (19), హెఏఎం ఆర్‌ఎల్‌ఎం సీట్లను దక్కించకున్నాయి. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌధరీ, విజయ్ కుమార్ సిన్హాతోపాటు జానపద గాయ ని మైథిలీ ఠాకూర్, ఇతర ప్రముఖులు శ్రేయసి సింగ్, ప్రేమ్ కుమార్, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఎన్నికల్లో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కేవలం 125 సీట్లు సాధించగా, ఈసారి 85 సీట్లు ఎక్కువగా దక్కించుకోవడం గమనార్హం.

నాడు ఎన్డీయే కూటమి బీజేపీ  జేడీయూ 43, వీఐపీ  హెఏఎం 4 సీట్లు దక్కించుకుంది.  2020 ఎన్నికల్లో 110 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి 35 సీట్లకే పరిమితమైంది. ఆర్జేడీ 2020 ఎన్నికల్లో 75 సీట్లు సాధించగా.. ఈసారి 25 స్థానాల్లోనే గెలిచింది. ఏకంగా 50 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ 19 నుంచి ప్రస్తుతం ఆరు స్థానాలకే పరిమితమైంది. ఆ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ గెలిచారు. భారీ ఉత్కంఠ మధ్య తేజస్వీ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సతీశ్‌కుమార్‌పై 14,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తేజస్వీ మొత్తం 1,18,597 ఓట్లు దక్కించుకున్నారు. 

నితీశ్ నేరుగా పోటీ చేయలేదు..

ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచీ నేరుగా పోటీ చేయలేదు. ఆయన రెండు దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతూ ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నారు. ఆయ న ఈసారి కూడా అదే ఆనవాయితీని పాటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.  8:30 గంటల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల లెక్కింపు ప్రారంభమైంది.  ప్రతి నియోజకవర్గానికి 25నుంచి 30 రౌం డ్లలో లెక్కింపు పూర్తయింది. రాష్ట్ర పోలీస్‌శాఖ అధికారులు కౌంటింగ్ కేంద్రాల పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. 

నిమో సునామీకి ఘఠ్బంధన్ గల్లంతు 

మహా కూటమి సఫా.. 200 సీట్ల మార్కు దాటిన ఎన్డీఏ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే కూట మి) ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. 243 స్థానా లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూట మి ఏకంగా 200 సీట్ల మార్కును దాటి మహాఘఠ్బంధన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేసింది.

ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పటిమ కలగలసిన ‘నిమో’ (నితీష్, మోదీ) ఒరవడితోనే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎగ్జిట్ పో ల్స్‌లో ఎన్డీయే కూటమికి 150 సీట్లలోపే వస్తాయని అంచనా. తాజాగా ఎన్డీయే కూటమి విజ యం అందరి అంచనాలను మించింది. ఆరంభంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీజేపీతో పాటు తన మిత్రపక్షం జేడీయూ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలోకి దూసుకెళ్లాయి. అలాగే చిరాగ్ పాశ్వాన్ నే తృత్వంలోని ఎల్‌జేపీ(ఆర్వీ) పార్టీ సైతం మంచి స్ట్రుకింగ్ ఇచ్చింది. ఈ సునామీలో మహా కూటమి కొట్టుకుపోయింది. 

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ స్థా పించిన ‘జన్ సురాజ్ పార్టీ’ ఒక్క సీటై నా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయా రు. కనీసం ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలవలేదు. ఒకప్పుడు గొప్ప వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ఆయనకు ఈ ఎన్నికలు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించాయి. నితీశ్‌కుమార్, నరేంద్ర మోదీ (నిమో) చరిష్మానే ఎన్డీయే కూటమి విజయానికి ప్రధా న కారణం. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళాఓటర్ల అధిక సంఖ్య లో ఓటింగ్, అలాగే ప్రధాని మోదీ ప్రచార దూకు డు ఈ జట్టును గెలిపించాయి. ఆర్జేడీ ఆటవిక పాలనపె ప్రధాని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ విజయం బీహార్‌లోని రాజకీయ సమీకరణలను మార్చివేసింది.

అంచనాలు మించిన విజయం

బీహార్ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఎగ్జిట్‌పోల్స్ చేపట్టిన సర్వే సంస్థలు సఫలమయ్యాయి. గతంలో జరిగిన విధంగానే సర్వే సంస్థలు మరోసారి ‘తుప్పు’లో కాలేశాయి. ఎందుకంటే అన్ని సంస్థ లూ ఎన్డీయే కూటమి విజయాన్నే అయితే అంచనా వేశాయి కానీ, ఒక్క సంస్థ అయినా ఆ కూటమి 200 సీట్లకు పైగా సాధిస్తుందని చెప్పలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్డీయే కూటమి తక్కువలో తక్కువ 130 స్థానాలు, గరిష్ఠంగా 167 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. అలాగే మహాఘఠ్బంధన్‌కు తక్కువ లో తక్కువగా 70 స్థానాలు, గరిష్ఠంగా 108 స్థానాలు వస్తాయని వెల్లడించాయి. కానీ, శుక్రవారం వెలువడిన ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయి.

న్డీయే కూటమి ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకున్నది. మహాఘఠ్బంధన్ కేవలం 35 స్థానాలకు పరిమి తమైంది. బీహార్ ఓటర్ల నాడి పట్టుకోవడంలో సర్వే సంస్థలు గతంలోనూ అంచనా లు తప్పాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్బంధన్‌కు, ఎన్డీయే కూటమి మధ్య గట్టిపోటీ ఉంటుందని సర్వేసంస్థలు అంచ నా వేశాయి. కానీ, అందుకు భిన్నంగా 178 స్థానాల్లో మహాఘఠ్బంధన్ విజయబావుటా ఎగురవేసింది. 2020లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘఠ్బంధన్ విజయాన్ని అన్ని సంస్థలూ అంచనావేయగా, నాడు జేడీ యూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూ టమి 125 స్థానాల్లో విజయం సాధించింది.