calender_icon.png 4 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం

04-12-2025 12:00:00 AM

మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 3 (విజయక్రాంతి):గుండ్లపోచంపల్లి మేడ్చల్ మున్సిపల్ పట్టణాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బిజెపి నాయకులు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవుళ్ళపై సీఎం రేవంత్ అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలకు హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.

హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి హెచ్చరించారు.రానున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఓటు బ్యాంకు రాజకీయాలను మానుకోవాలని కేవలం రాహుల్‌ఖాన్ మెప్పు కొరకు రేవంత్ రెడ్డి ఎంత శ్రమించిన పోయేకాలం దగ్గర్లోనే ఉందని మోహన్ రెడ్డి జోష్యం చెప్పారు.

మేడ్చల్‌లో..

 మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్  ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ మతాన్ని చిన్న సూపు చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జ్ రంజిత్ మోహన్, మేడ్చల్ జిల్లా నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, బిజెపి మాజీ కౌన్సిలర్ అమరం సరస్వతి మోహన్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ జైతువాల కిషన్,

మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, గౌరారం జగన్ గౌడ్, మున్సిపల్ పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శిలు జాకట ప్రేమ్ దాస్.వంశీ విజయ్ వంజరి సీనియర్ నాయకులు పాతూరి సుధాకర్ రెడి, మాజీ సర్పంచ్ మురళి గుప్త.సీనియర్ బిజెపి మహిళా నాయకురాలు బచ్చు కృష్ణప్రియ మల్లారెడి, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, రాఘవరెడ్డి, మైసరి రాజు, సర్వేశ్వర్ రెడ్డి, అనిత, నరేందర్, ఈశ్వర్ పాల్గొన్నారు.