24 July, 2026 | 6:03 PM

కేరళలో యూడీఎస్ విజయ దుందుభి

05-06-2024 02:15 AM

కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎస్ కూటమి పైచేయి సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 లోక్‌స్థానాలు ఉండగా యూడీఎఫ్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 18 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ఎల్డీఎఫ్ ఒక స్థానం, బీజేపీ ఒకస్థానంలో విజయం సాధించాయి. ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాలన, సీపీఎంపై అసహనంగా ఉన్న ఓటర్లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మళ్లారని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. వయనాడ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తిరువనంతపురం స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు కేరళలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసారైనా ఏ బీజేపీ అభ్యర్థీ ఎన్నికల్లో గెలవలేదు.