11 March, 2026 | 2:49 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన

11-03-2026 01:26 PM

మన ప్రధాని మోదీ రాజీపడ్డారు: రాహుల్ గాంధీ

రాహుల్ వ్యాఖ్యలపై రవిశంకర్ ప్రసాద్ అభ్యతరం

మంటగలిపే తీర్మానాలు ఏమాత్రం సరికాదు

న్యూఢిల్లీ: మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) రాజీపడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్(BJP MP Ravi Shankar Prasad) అభ్యతరం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఎప్పుడూ రాజీ పడలేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇప్పుడు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చిందని తెలిపారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు చర్చకు అస్కారం లేదని సూచించారు. ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ ను చాలాసార్లు అవమానించారని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

ప్రచురించని పుస్తకం గురించి సభలో మాట్లాడటంతో వివాదం మొదలైందని రవిశంకర్ తెలిపారు. స్పీకర్ పై అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో గతంలో నెహ్రూ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తీవ్రమైన ఆరోపణలు, రుజువులు ఉంటేనే అవిశ్వాసం పెట్టాలని నెహ్రూ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి పక్ష నేత కూడా సభలో భాగమేనని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిపక్షనేతకు చక్కటి వ్యక్తిత్వం ఉండటం చాలా అవసరమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పలుమార్లు బాధ్యతారహితంగా మాట్లాడారని రవిశంకర్ ఆరోపించారు.

ఇస్లామిక్ టెర్రరిజం(Islamic terrorism) కంటే హిందూ టెర్రరిజం ప్రమాదకరమని అమెరికాలో రాహుల్ గాంధీ అన్నారని ఆయన సూచించారు. బిపిన్ రావత్(Bipin Rawat) ను వీధి గూండా అని రాహుల్ బాధ్యతరాహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అహంకారం కారణంగానే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారని రవిశంకర్ మండిపడ్డారు. అరాచకానికి ఈ సభ అవకాశం కల్పించకూడదని కోరారు. పార్లమెంట్ ప్రతిష్టు మంటగలిపే ఇలాంటి తీర్మానాలు ఏమాత్రం సరికాదని హితవు పలికారు.