కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం
న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి కావూరు సాంబశివరావు(Kavuri Samba Siva Rao) కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాంబశివరావు తుదిశ్వాస విడిచారు. కావూరు సాంబశివరావు మలీపట్నం, ఏలూరు నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. మన్నోహన్ సింగ్ కేబినెట్ లో సాంబశివరావు కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కావూరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
కావూరు సాంబశివరావు 1943లో ఏలూరులో జన్మించారు. కావూరు వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజినీరింగ్ పట్టా తీసుకున్నారు. 'మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణించారన్న వార్త నాకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఎక్స్ లో పేర్కొన్నారు.




