10 May, 2026 | 2:33 PM

Breaking News

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •  

కంగనా రనౌత్‌ను బీజేపీ కంట్రోల్ చేయాలి

30-08-2024 12:46 AM
  1. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 
  2. అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కంగనాపై ఫిర్యాదు 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ పార్టీ చర్యలు తీసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉందని, చెత్త ప్రసంగాలు చేస్తారని విమర్శించిన ఆమెపై వీహెచ్ మం డిపడ్డారు.  గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కంగనా లాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడుతారని, ఆమెను కంట్రోల్ చేయాల్సిన బా ధ్యత బీజేపీ చీఫ్ నడ్డాపై ఉందన్నారు.

కంగనాపై అంబర్‌పేట్  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేసినట్లు తెలిపారు. రాహుల్‌కు ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెపై కేసులు నమోదు చేయాలని డీజీపీ, సీపీకి  విజ్ఞప్తి చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్  మంచి పని చేస్తున్నారని ప్రశంసించారు. పేదల ఇళ్లు కూల్చితే వారికి ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను  ఇవ్వాలన్నారు. అంబర్‌పే టలోని ముస్లిం స్మశాన వాటికలో కూడా ఇండ్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణం చేపట్టినా కూల్చేస్తామని సీఎం ప్రకటన చేయడం హర్షనీయమన్నారు.