19-07-2025 10:03:14 AM
బిజెపి రాష్ట్ర అధ్యక్షులకు నరపరాజు రామచంద్రరావు
చేగుంట, విజయక్రాంతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు(BJP state president Ramchandra Rao) అన్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు దొంతిరెడ్డి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామచంద్రరావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao) ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా,మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మండల పరిధిలోని జెడ్పిటిసి, ఎంపీటీసీ లతో పాటుగా అన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులని గెలిపించుకునే దిశగా, ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరిశంకర్,రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కర్ణం గణేష్ రవికుమార్, చింతల భూపాల్, నాగభూషణం, బాలచందర్, బిక్షపతి, గడ్డమీద సుజాత, లావణ్య, హరిశంకర్, సాయి ప్రసాద్, సాయిరాజ్, దాస్, సాయిబాబా, నరేష్,తదితరులు పాల్గొన్నారు.