calender_icon.png 19 July, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

19-07-2025 02:24:16 AM

  1. మేయర్ విజయలక్ష్మి సూచన
  2. వానల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ 040-21111111 నంబర్‌కు కాల్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచిం చారు. హైడ్రా హెల్ప్ నంబర్ 90001 13667కు సంప్రదించాలని మేయర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిం ది.

ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి గురువారం నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావొద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ, హైడ్రా బృందాలు ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆదేశించారు.