calender_icon.png 19 July, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పొంగిపొర్లిన భీమ లింగం కాలువ

19-07-2025 10:05:57 AM

  1. ఇండ్లలోకి చేరిన నీరు
  2. ప్రమాదం పసిగట్టి స్పందించిన అధికారులు
  3. ఊపిరి పీల్చుకున్న కాలనీల వాసులు

వలిగొండ, (విజయక్రాంతి): గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వలిగొండ మండల కేంద్రంలోని అధికారుల మార్కెట్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి పొంగిపొర్లింది. దీంతో పలు ఇండ్ల నుండి పలు కాలనీలకు భారీగా వరద నీరు పారింది. వరద పరిస్థితి గురించి కాలనీలవాసులు ఇరిగేషన్ అధికారులకు సమాచారాన్ని చేరవేయడంతో భీమలింగం కాలువ(Bhimalingam Canal) కట్ట తెగినట్లయితే పలు కాలనీలలోని ఇండ్లు పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుందని ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టి భీమలింగం కల్వకు అడ్డంగా ఉన్న పైపులైన్లను తొలగించారు. దీంతో నీరు కాలువలో సాఫీగా ప్రవహించి కాలువ పొంగిపొల్లడం ఆగిపోయింది. దీంతో పలు కాలనీల వాసులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కాలువలో పెద్ద ఎత్తున గుర్రపుడెక్కాకు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని మరోసారి ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా అధికారులు చూడాలని వివిధ కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు.