16 July, 2026 | 12:32 AM

బీజేపీ ఎస్‌ఐఆర్ నియోజకవర్గ స్థాయి సమావేశం

16-07-2026 12:16 AM

బోధన్, జూలై 15 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్,ఐ,ఆర్ నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ SIR టీమ్ సభ్యులు కొంజర్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి బోధన్ నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన SIR కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను కొంజర్ల శ్రీనివాస్కు వివరించారు.

అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాలు, బూత్లలో నిర్వహించిన SIR కార్యక్రమం పురోగతి, నమోదైన వివరాలపై సమీక్ష నిర్వహించారు. కొంజర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ SIR కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు.

భవిష్యత్తులో కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు, ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్, జిల్లా ఐటీ సెల్ ఇన్చార్జి పిల్లి శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు గోపీకిషన్, ఇంద్రకరణ్, సుదర్శన్, సీనియర్ నాయకులు సుధాకర్ చారి, గుంత గంగాధర్, మల్లెపూల శ్రీనివాస్, ఇర్వంత్ రావు పటేల్, పవన్, ప్రధాన కార్యదర్శి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.