2 July, 2026 | 10:49 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

బీజేపీ భారీ ర్యాలీ – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కలెక్టర్‌కు వినతిపత్రం

20-03-2026 02:48 PM

“6 గ్యారంటీలు ఎక్కడ? రైతు భరోసా, నిరుద్యోగ భృతి, పెన్షన్లపై కాంగ్రెస్‌ను నిలదీసిన బిజెపి”

హనుమకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యలను ఎండ గడుతూ బిజెపి హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో అదాలత్ జంక్షన్ నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 హామీలను పూర్తిగా అమలు చేయడంలో  ఘోరంగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.

రైతు భరోసా ఇంకా పూర్తిస్థాయిలో అందలేదని, తీవ్ర ఆలస్యంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇప్పటికీ అమలు కాలేదని, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు  అర్హులైన అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పెన్షన్ ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత ఫీజు రీయింబర్స్‌మెంట్  లేక, ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.అలాగే 7, 10, 11, 54 డివిజన్లలో హిందూ శ్మశానవాటికలు సక్రమంగా మెయింటైన్ చేయడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బిజెపి పోరాటం ఆగదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతదూరమైనా వెళ్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ,  డా. కాళి ప్రసాద్ , డా. విజయ్ చందర్ రెడ్డి , చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్ , దొంతి దేవేందర్ రెడ్డి , గుజ్జా సత్యనారాయణ, నాను నాయక్ ,  కార్పొరేటర్లు చాడ స్వాతి , అభినవ్ భాస్కర్ , గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి , బైరి లక్ష్మి , రావుల కోమల , జిల్లా ప్రధాన కార్యదర్శులు జయంత్ లాల్ , డా. సండ్ర మధు , ఇతర జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.