2 July, 2026 | 10:51 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!

02-07-2026 09:58 AM

పరిస్థితి విషమం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలింపు.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. గ్రామంలోకి దూసుకొచ్చిన కుక్క చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా సుమారు 10 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.  దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే తెలకపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్సతో పాటు రేబీస్ వ్యాక్సిన్ అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108సాయంతో నాగర్‌ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో బొడ్డుపల్లి వెంకటేష్, సల్వది వర్షిణి, కాశమ్మ ఇటిక్యాల నిశ్వoత్, గౌరరం సైదులు, నేరేడి నవ్యశ్రీ, అల్వల యశ్వంత్, శేఖర్ తో పాటు మరికొంత మంది ఉన్నారు.  గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు.