కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఒక అబద్ధాన్ని100 సార్లుచెప్పి.. నిజమని నమ్మించే ప్రయత్నం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Minister Mallu Bhatti Vikramarka) రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపట్టారు. బడ్జెట్ పై హరీశ్ రావు(Harish Rao) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... వృద్ధులకు రూ. 4 వేలు పింఛన్ ఇస్తారమో అని చూశామని, పింఛన్ల విషయంలో కోత పెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1 శాతం ఉండేదన్న ఆయన కాంగ్రెస్(Congress) హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 10.2 శాతానికి పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం వల్లే.. తలసరి ఆదాయం తగ్గిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయంలో జీఎస్ డీపీ వృద్ధి 12.50 శాతం ఉండేది, కాంగ్రెస్ హయాంలో జీఎస్డీపీ వృద్ధి 10.07 శాతానికి తగ్గిందన్నారు. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ తగ్గిందని సూచించారు. కాంగ్రెస్ ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మూడు ముక్కలాట తప్ప.. ప్రజలపై ప్రేమ లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్(Telangana Budget 2026-27) ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైందని తెలిపారు.
పారిశ్రామికవేత్తలపై తొపాకులు పెట్టి.. వసూల్లకు పాల్పడితే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇండస్ట్రియల్ హబ్.. కరెప్షన్ హబ్ గా మారిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రభుత్వం భారతదేశంలో ఏదీ లేదన్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి.. నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీకి రూ. 2500 కోట్లు బకాయిలు పెట్టారని సూచించారు. ఉచిత బస్సు వల్ల ఆర్టీసీకి లాభాల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. ఆర్టీసీ లాభాల్లో ఉంటే.. గత రెండేళ్లలో అప్పులు ఎందుకు చేశారు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బస్టాండ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు.




