2 July, 2026 | 10:33 AM

Breaking News

సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో

02-07-2026 09:55 AM

సిర్గాపూర్ జూలై 2(వినాయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), సుల్తానాబాద్ సబ్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, ప్రసూతి సేవలు, ప్రయోగశాల, రోగుల నమోదు వివరాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది డాక్టర్ లలిత, దేవి, జైరామ్ MLHP, కృష్ణవేణి, రాంచందర్, భాస్కర్, డాక్టర్ లక్ష్మి నారాయణ ఉన్నారు.