1 June, 2026 | 1:20 AM

ముగిసిన బీజేపీ శిక్షణ

01-06-2026 12:18 AM

2 రోజులు....12 సెషన్స్.... కీలక నేతల దిశా నిర్దేశం

మనకొండూర్, మే31(విజయక్రాంతి): రెండు రోజులు,12 సెషన్స్, బిజెపి కీలక నే తల దిశా నిర్దేశంతో కరీంనగర్ జిల్లా బిజెపి ప్రశిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. కరీంనగర్ బిజెపిలో వివిధ స్థా యిలో పనిచేస్తున్న కార్యకర్తలు నాయకుల కోసం శనివారం రోజున తిమ్మాపూర్ మం డలం మహాత్మా నగర్ లో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పండిత్ దీన్ ద యాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ న మహా అభియాన్ పేరుతో శిక్షణ తరగతులు ప్రారంభిం చింది.

శిక్షణా తరగతులలో 346 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బిజెపిరాష్ట్ర అధ్యక్షులు ఎన్ . రామచందర్ రావు శిక్షణ తరగతులను ప్రారంభించి పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంస్థాగత బలోపేతం , భవిష్యత్తు రాజకీయ కార్యాచర ణ పై దిశా నిర్దేశం చేశారు. అలాగే పార్టీ నీ మరింత బలోపేతం చేసే దిశలో 12 కీలక అంశాలపై బిజెపి రాష్ట్ర ముఖ్య కీలక నేతలు అ య్యంగారీ ప్రభాకర్ రెడ్డి, దేవకి వాసుదేవరావు, అల్జాపూర్ శ్రీనివాస్, బండారి శాం తి కుమార్, రాణి రుద్రమ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పో రెడ్డి కిషోర్, రం జిత్ మోహన్, మురళీధర్ రావు, కడగంచి రమేష్ , కరీంనగర్ ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ భాను జి ల ద్వారా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చారు.

శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ సి. హెచ్ .విద్యాసాగర్ రావు హాజరై మాట్లాడారు. పా ర్టీ సిద్ధాంతాన్ని భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లి, పార్టీ నీ మరింత విస్తరించడానికి కృషి చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన విషయాలను , అంశాలను ఆచరించి బిజెపి నీ బలమైన శక్తిగా తీర్చిదిద్ది, స మాజంలో మంచి నాయకులుగా, కార్యకర్తలుగా రాణించాలని ఆకాంక్షించారు.

శిక్షణా తరగతుల్లో బిజెపి జిల్లా అధ్యక్షు డు గంగాడి కృష్ణారెడ్డి , మేయర్ కోలగని శ్రీనివాస్ , డిప్యూటీ మే యర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు , జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివా స్ గౌడ్ , మా డ వెంకటరెడ్డి , బత్తుల లక్ష్మీనారాయణ , జి ల్లా ఉపాధ్యక్షులు కళ్లెం వాసుదేవ రెడ్డి , రం గు భాస్కరాచారి, గుర్రాల వెంకట్ రెడ్డి , సా యిని మల్లేశం , ఎర్రబెల్లి సంపత్ రావు , పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రా వు, ప్రశిక్షణ కమిటీ బాధ్యులు గుజ్జ శ్రీనివా స్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, చింతం శ్రీనివాస్ , రాష్ట్ర నాయకులు గుగ్గిలపు రమేష్, మేకల ప్రభాకర్ యాదవ్ తదితరులున్నారు.