సరితకు రాష్ట్రస్థాయి అవార్డు
పాల్వంచ, మే 31 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో గల చరిత ఆర్గానిక్ కల్టివేషన్, సోలార్ డ్రైవర్స్ సంస్థకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. జన జాతీయ జరిమా ఉత్సవ్ 2026 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతులమీదుగా సమస్త నిర్వహణ అధికారి డాక్టర్ ఎస్ సోమరాజు దొర కు బెస్ట్ ట్రైబల్ అచీవర్ అవార్డును బహుకరించారు.
18 నెలల క్రితం స్థాపించిన ఈ సమస్త ఆర్గానిక్ నేచురల్ ఉత్పత్తుల సేకరణ, తయారీ రంగాల్లో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, అందిస్తున్న అత్యుత్తమ సేవలకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఈ సందర్భంగా డాక్టర్ సోమరాజు దొర మాట్లాడుతూ సంస్థ ప్రారంభించిన అనతి కాలంలోనే రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కడం ఆనందదాయకం అన్నారు.
భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న చరిత ఆర్గానిక్ కల్టివేషన్, సోలార్ డ్రయర్స్ సంస్థను ప్రశంసించారు.






