calender_icon.png 29 July, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం

28-07-2025 06:23:42 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి బీజేపీ కార్యకర్తలను గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథి బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. గ్రామ గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం రోజున అనగా 30 7 2025 రోజున హరిహర వీరమల్లు సినిమా సనాతన ధర్మాన్ని చక్కగా వివరించడం జరిగింది హిందుత్వం ఐక్యత ఎంత అవసరమో తెలియజేస్తున్న సినిమాను అని బిజెపి పట్టణ శాఖ సమావేశంలో నాలుగు షోలు ఉచిత ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని పట్టణంలోని అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబ సమేతంగా ఈ సినిమాను వీక్షించి హిందు ధర్మం సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు పాత్రులు కాగలరని కోరుతున్నారు. ఈ సమావేశం పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ చంటి రాజ్ కుమార్ అడ్వకేట్  కార్యకర్తలు పాల్గొన్నారు.