calender_icon.png 29 July, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి

28-07-2025 06:20:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed)తో కలిసి ప్రజా ఫిర్యాదులలో స్వీకరించిన వాటిని పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా సమీక్ష చేశారు. మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.