28-07-2025 06:27:56 PM
కొండపాక (విజయక్రాంతి): కొండపాకకు చెందిన శ్రీ రామదాసు చారిటబుల్ ట్రస్ట్(Sri Ramadasu Charitable Trust) ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యాదాన్ సేవలో భాగంగా కొండపాక గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.3670 విలువగల నోటుబుక్స్ ను దొడ్డం శిరీష బీవీ హరీష్ సహకారంతో సోమవారం అందజేశారు. అన్ని ధానాలలో కన్నా విద్యాదానం గొప్పది అని మానవతా సేవ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విట్టల్ నాయక్ , ట్రస్ట్ ఇంచార్జ్ అంబటి నర్సింలు, వాలంటీర్ తిరునగారి శ్రీయ ,రామదాసు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడీల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.