calender_icon.png 16 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీని తిప్పికొట్టాలి

16-10-2025 02:05:44 AM

నకిరేకల్, అక్టోబర్ 15: బీసీ రిజర్వేషన్లను అమలు కాకుండా కుట్ర చేస్తున్న బిజెపి అవకాశవాద వైఖరిని గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, పిలుపునిచ్చారు.  బుధవారం స్థానిక సిపిఎం  రామన్నపేట మండల కార్యాలయంలో ఆపార్టీ మండల కమిటీ సమావేశానికి  హాజరై మాట్లాడారు.

రాష్ర్ట ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ర్ట గవర్నర్, రాష్ర్టపతికి పంపి మూడు నెలలు గడుస్తున్న వాటిని ఆమోదించకుండా ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తూ ఎన్నికలను గందరగోళపరుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య,

మండల కార్యదర్శి బొడ్డుపల్లి, జిల్లా కమిటీ సభ్యులు బలుగూరి అంజయ్య, మండల కార్యదర్శి వరద సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, బోయిని ఆనంద్, మండల కమిటీ సభ్యులు గన్నేబోయిన విజయభాస్కర్ భావనలపల్లి బాలరాజు నాగటి ఉపేందర్ గొరిగెసోములు గాదె నరేందర్ తొలుపునూరి శ్రీనివాస్, వేముల సైదులు, ఎండి రషీద్, మేడి గణేష్,డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షకార్యదర్శులు శానకొండ రాము, మెట్టు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 కేతేపల్లి మండలంలో..

కేతపల్లి మండల కేంద్రంలోని ఎన్‌ఎస్‌ఆర్ భవన్ లో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా  ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుగాకుండా బిజెపి అడ్డుకుంటుందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించిన  , గవర్నర్ల వ్యవస్థ తమ చేతుల్లో ఉంచుకొని  బిల్లు ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతుంది అని విమర్శించారు .

రాష్ర్టంలో ఉన్న కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బిల్లును ఆమోదించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్తుమారయ్య మండల నాయకులు కోట లింగయ్య, లకపాక రాజు,  వీరబోయిన సౌడయ్య, బంధ బాలస్వామి, జటంగిపిచ్చాయ పాల్గొన్నారు.