26 February, 2026 | 4:12 AM

కబంధ‘హస్తా’ల్లో తెలంగాణ విలవిల

26-02-2026 02:03 AM
  1. కాంగ్రెస్‌పై ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): కాంగ్రెస్ కబంధహస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా తెలంగాణ విలవిలలాడుతున్నదని బీఆ ర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా రు. తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా కాంగ్రెస్ నాయకులు బతకనివ్వడం లేదని మండిపడ్డారు.

ప్రతి పల్లె లో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యం తో కేసీఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవా రం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులే నిర్ధాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని తెలిపారు.

పదేళ్లపాటు ఆహ్లాద వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభు త్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని మరోసారి పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలోని ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.