16-10-2025 02:03:33 AM
సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
చౌటుప్పల్, అక్టోబర్ 15(విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని దివిస్ లాబొరేటరీస్ పరిశ్రమను కాపాడేందుకు పేద రైతుల పొట్టగొడతారా అని సిపిఐ జాతీయ కార్యదర్శి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని త్రిబుల్ ఆర్ అలెన్మైంట్ ప్రకారం భూములు కోల్పోతున్న రైతుల భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ ను ఆశాస్త్రీయంగా ఓ ఆర్ ఆర్ రోడ్డు నుంచి 40 నుంచి 60 కిలోమీటర్లు తీసుకొని చౌటుప్పల్ కు ఉత్తర దక్షిణ ప్రాంతంలో 28 కిలోమీటర్లు ఎందుకు కుదించారని ఆయన నిలదీశారు. త్రిబుల్ ఆర్ అలెన్మైంట్ పాము వంకర లాగా తిప్పుతూ ఒకచోట 50 కిలోమీటర్లు మరోచోట 60 కిలోమీటర్లు చౌటుప్పల్ దగ్గరికి వచ్చేసరికి 28 కిలోమీటర్లు ఎన్ని రకాలుగా మార్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో బయట పెట్టాలన్నారు.
ఓ ఆర్ ఆర్ నుండి త్రిబుల్ ఆర్ అలెన్మైంట్ సమాంతర దూరం నుంచి మార్చాలన్నారు. ప్రస్తుత అలెన్మైంటు దివిస్ ఫార్మా కంపెనీ కాపాడడం కోసమే మార్చినట్టు తెలుస్తుందన్నారు. ఫార్మా కంపెనీల కోసం కాకుండా పేద రైతులను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా అలెన్మైంట్ చేయాలని సన్న ,చిన్న కారు రైతులను నాశనం చేసి వారి శవాలపై రోడ్లు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలో ప్రస్తుత అలెన్మైంట్ మూలంగా విలువైన భూములను ఇండ్లు, ఫ్లాట్లకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని, త్రిబుల్ ఆర్ అలెన్మైంట్ 60 కిలోమీటర్ల దూరానికి మార్చాలని అక్కడ కూడా భూమి పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని లేని ఎడల బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం 3రెట్లు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.
అలాగే త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల సమస్యలపై శాసనమండలి సమావేశంలో చర్చిస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేశారు. అలాకాకుండా ఫార్మా కంపెనీల కొమ్ము కాస్తూ పేద రైతుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శి సత్యనారాయణ, భూ నిర్వాసితులు చింతల దామోదర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి,కురిమిద్దె శ్రీనివాస్,బోడ సుదర్శన్, కళ్లెం కృష్ణ, ఎండి. ఇమ్రాన్,పెరబోయిన మహేందర్, పగిల్ల మోహన్ రెడ్డి,పిల్లి శంకర్, కొండూరి వెంకటేష్, ఉడుత రామలింగం, బద్దుల సుధాకర్, భూ నిర్వాసితులు సందగల మల్లేశం, జాల శ్రీశైలం, బోరం ప్రకాష్ రెడ్డి, గుండెబొయిన వేణు, మార్గం నరసింహ, సుర్కంటి శశికళ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.