2 August, 2026 | 4:44 PM

బీజేపీ 305 సీట్లు గెలుచుకుంటుంది

23-05-2024 06:59 AM

అమెరికా రాజనీతి శాస్త్రవేత్త జోస్యం

న్యూయార్క్, మే 22: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే మూడో సారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. తాజాగా అమెరికా రాజనీతి శాస్త్రవేత్త ఇయాన్ బ్రెమ్మర్ ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో 305కు అటుఇటుగా సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించారు. మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. 295 నుంచి 315 మధ్య సీట్లు రావొచ్చని అంచనా వేశారు. భారత్‌లో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నా యని ప్రశంసించారు.