15 June, 2026 | 9:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

గాంధీభవన్ ముట్టడికి బీజే వైఎం యత్నం

22-02-2026 02:25 AM
  1. అడ్డుకున్న పోలీసులు 

పోలీసుల తీరుపై బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆగ్రహం

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాం తి): ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరును నిరసిస్తూ భారతీయ జన తా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం నాంపల్లిలోని గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి గాంధీ భవన్‌వైపు బీజేవైఎం కార్యకర్తలు దూసుకొస్తూ రాహుల్ గాంధీ,

కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమం లో అక్కడ భారీగా పోలీసులు మోహరించి వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారు: బీజేపీ రాష్ట్ర చీఫ్

ఏఐ గ్లోబల్ సమ్మిట్‌లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో దేశమంతా కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నేరమన్నారు. ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.