15 June, 2026 | 10:35 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఖాకీలతో కలిసి పనిచేద్దాం రండి

22-02-2026 02:24 AM

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఆఫర్ 

వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం: సీపీ సజ్జనార్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 2౧ (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పోలీస్ విభాగం సరికొత్త సమాజ భాగస్వామ్యంతో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడమే కాకుండా, యువతలోని సజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ నిపుణుల కోసం ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్‌లను శనివారం అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమాల ద్వారా అటు విద్యార్థులకు ప్రభుత్వ పరిపాలనపై ఆచరణాత్మక అవగాహన, ఇటు పోలీస్ శాఖకు యువత నుంచి నూతన దృక్పథం లభిస్తుందని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు.

25 ఏళ్ల లోపు వయస్సు ఉన్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు పోలీసు శాఖలోని ప్రాధాన్యతలకు అనుగుణంగా డేటా అనాలిసిస్, పరిశోధన ఆధారిత ప్రాజెక్టులు ఆధునిక పోలీసింగ్ పద్ధతులకు సంబంధించిన విధులను కేటాయిస్తారు. నేర పరిశోధన, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా పోలీసింగ్ వంటి అంశాలపై విద్యార్థులు లోతైన అవగాహన పెంచు కోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అధికారిక సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ ప్రక్రియ అంతా కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్‌ఎమ్‌ఐటీ సెల్ ద్వారా సమన్వ యం చేయబడుతుంది. విద్యార్థులే కాకుం డా, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణులు కూడా ప్రొఫెషనల్ వాలం టీర్‌గా చేరి పోలీసులకు సహకరించవచ్చు.