16 July, 2026 | 12:31 PM

కాంగ్రెస్ వైఫల్యంతోనే బీజేపీ విజయం

07-06-2024 12:31 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్  

వనపర్తి , జూన్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే బీజేపీ విజయం సాధించిందని, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే బాగుం డదని బీఆర్‌ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని లేక ఎమ్మెల్యే మేఘారెడ్డి మైకు ముందు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ వ్యాఖ్యలను మాను కొని అభివృద్ది పనులపై దృష్టి సారించాలని హితవు పలికారు. గరువారం వనపర్తిలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాస గృహం లో మీడియాతో గట్టు యాదవ్ మాట్లాడారు. నియోజకవర్గంలో హుందాతనాన్ని కాపాడాలని, తమ పార్టీ అంతర్గత పోరును ఇతరులపై రుద్దడం తగదని ఎమ్మెల్యేకు సూచించారు. గత ఎమ్మెల్యేలకు మించి నిరంజన్‌రెడ్డి వనపర్తిని అభివృద్ధి చేశారని.. ఆయనను విమర్శిస్తే అభివృద్ధిని కించపరిచినట్టేనని చెప్పారు. చేతనైతే అభివృద్ధి చేసి చూపాలని పేర్కొన్నారు.