జనగామలో ఆర్‌ఎంపీల రిలే దీక్షలు
ఎన్‌ఎంసీ దాడులు ఆపాలని డిమాండ్
జనగామ, జూన్ 6(విజయక్రాంతి): పల్లె వైద్యులపై ఎన్‌ఎంసీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, దాడులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆర్‌ఎంపీలు, పీఎంపీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, ఉపాధ్యక్షుడు వెంకటాచారి ఆరోపించారు. అధికారుల దాడులకు నిరసనగా గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట సం ఘం జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలకు దిగారు. పట్టణంలో నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రనాయకులు మాట్లాడుతూ.. ఎన్‌ఎంసీ దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశా రు. అర్హులందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరా రు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంతెన రమేశ్, ఆలేటి సురేందర్‌రెడ్డి, మంగ రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.






