23 July, 2026 | 10:01 PM

బీజేపీ విజయం సంపూర్ణం

05-06-2024 03:09 AM

మధ్యప్రదేశ్‌లో అధకార బీజేపీ లోక్‌సభ ఉన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాలకు 29 చోట్లా బీజేపీ ఘన విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 29 సీట్లు గెలుచుకొన్న ఆ పార్టీ ఈసారి మిగిలిన ఒక్క సీటును కూడా తన ఖాతాలో వేసుకొన్నది. రాష్ట్రంలో 5.63 కోట్ల మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 19, 26, మే 7, మే 13 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో ఆరు ఎస్సీ, నాలుగు ఎస్టీ రిజర్వుడు సీట్లు ఉన్నాయి. ఆయా వర్గాల ప్రజలు కూడా బీజేపీకే పట్టంగట్టారు. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలువలేక చేతులెత్తేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు దిగ్విజ్‌సింగ్ తోపాటు కమల్‌నాథ్ కుమారుడు కూడా ఓడిపోయారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సీఎం సీటు దక్కని శివరాజ్‌సింగ్ చౌహాన్.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర మంత్రి పదవికి లైన్‌లో నిలిచారు.