బీజేపీకి ఎదురుగాలి
05-06-2024 03:08 AM
పంజాబ్‌లో ఎదురుగాలి వీచింది. ౧౩ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయింది. గతంలో ఉన్న ఒక్క సీటును కూడా కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ కలయిక మ్యాజిక్ పనిచేసింది. ౧౩ స్థానాలకు గాను కాంగ్రెస్ ౭ స్థానాల్లో, ఆప్ మూడు స్థానాల్లో ఘన విజయం సాధించాయి. ఇక శిరోమణి అకాలీదళ్ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకుం ది. మిగిలిన రెండు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇందిరాగాంధీ హంతకుడు బియాంత్ సింగ్ కొడుకు సరబ్‌జీత్ సింగ్ ఖల్సా ఫరీద్‌కోట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.






