13 June, 2026 | 2:34 AM

మండల ఉపసర్పంచ్ ఫోరం నూతన కమిటీ ఎన్నిక

13-06-2026 01:39 AM

వెంకటాపూర్, జూన్ 12 (విజయక్రాంతి):మండల కేంద్రంలో జిల్లా ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంకం సురేష్ ఆధ్వర్యంలో మండల ఉపసర్పంచ్ ల సమావేశం  ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఉపసర్పంచ్ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అన్నబోయిన రాజు, ఉపాధ్యక్షుడిగా మోరె లింగస్వామి, ప్రధాన కార్యదర్శిగా పాడ్య రాజు, ప్రచార కార్యదర్శిగా జొన్నల రమ్య రమేష్, అధికార ప్రతినిధిగా తవిటి లావణ్య కుమారస్వామిని ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులుగా జంబుల రాజమణి, పులి నర్సయ్య, కొండం తిరుపతిని ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింతం ప్రకాష్ రావు, జిల్లా అధికార ప్రతినిధి గోవిందు రాజ్ కుమార్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఉపసర్పంచ్ల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం,గ్రామాభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామ ప్రజల సంక్షేమం, స్థానిక సంస్థల బలోపేతానికి నూతన కమిటీ కట్టుబడి పనిచేస్తుందని వారు తెలిపారు.